Rashmika Mandanna : అమ్మ చెప్పేది...రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rashmika Mandanna : అమ్మ చెప్పేది...రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌‌ను సాధించింది. అయితే ఈ సినిమాలో హీరో పాత్రపై పలు విమర్శలు వస్తున్నాయి. వాటిపై తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘కథ ఆధారంగానే పాత్రలు హైలైట్ చేయాలో ఆలోచిస్తారు. ఒకవేళ హీరో దృష్టి కోణంలో రాస్తే అతని పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హీరోయిన్ కోసం రాస్తే ఆమెను హైలైట్ చేస్తారు. పాత్రల స్వభావాలు కూడా స్టోరీ ఆధారంగానే ఉంటాయి. ఏ మనిషిలో అయినా మంచి చెడు అనే రెండు గుణాలు ఉంటాయి. మా అమ్మ ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతుంటుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యత్యాసం వారి స్వభావం ఆధారంగానే ఉంటుందని అంటుంది" అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

Tags

Next Story