Rashmika Mandanna : నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి : రష్మిక

Rashmika Mandanna : నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి : రష్మిక
X

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితం ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రం ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన దీని ట్రైలర్ కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ‘సింహం లేకుండా ఉండొచ్చు కానీ.. ఆ సింహానికి పుట్టిన ఛావా ఇంకా బతికే ఉంది.. మరాఠాలను సవాలు చేయడానికి ధైర్యం చేస్తే మొఘల్ సామ్రాజ్యాన్నే లేకుండా చేస్తాం..' అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'ఛావా'.జిమ్ లో వర్కవుట్ చేస్తూ గాయపడ్డ రష్మిక కుంటుతూనే స్టేజీపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఒక నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి. ట్రైలర్ చూశాక కూడా ఎమోషనల్ అయ్యా. విక్కీ కౌశల్ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం డైరెక్టర్

లక్ష్మణ్ ఉటేకర్ నన్ను సంప్రదించినప్పుడు ఆశ్చర్యపోయా. ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరించా. ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ చేశా. టీమ్ అంతా ఎంతో సహకరించింది. ఇందులోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయి' అని చెప్పుకొచ్చింది రష్మిక. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేట్రికల్ గా రిలీజ్ కానుంది.

Tags

Next Story