Rajamouli : రాజమౌళి భారతంలో నాని పాత్రేంటీ..?

ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు పరిచయమైనట్టే. అయితే ఆయన సినిమాలో హీరోగా నటించిన కేవలం అరగంట పాత్రకే పరిమితమయ్యాడు నాని. ఈగ చిత్రంలో సమంత సరసన నటించినా ఆ పాత్ర అరగంటలోనే చంపబడటం తర్వాత ఈగగా మారడం అందరికీ తెలుసు. అయితే లేటెస్ట్ గా నాని హిట్ 3 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన రాజమౌళి తన మహా భారతం సినిమాలో నానికి పాత్ర ఇస్తానని వేదిక సాక్షిగా చెప్పాడు. అయితే అది తానుగా చెప్పలేదు. యాంకర్ సుమ అడగటంతో ఖచ్చితంగా నానికి తన మహాభారతంలో పాత్ర ఉంటుందని చెప్పాడు. మరి ఆ పాత్ర ఏమై ఉంటుందా అనేదే ఇప్పుడు అందరూ చర్చించుకుంటోన్న అంశం.
అయితే మహా భారతంలో నానికి సరిపోయే పాత్ర ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే.. నాని ఇమేజ్ కు తగ్గ పాత్రలు స్ట్రాంగ్ గా ఏమున్నాయి అనేది అంత అర్థం కాదు. పంచ పాండవుల్లో చివరి ఇద్దరిలో నకులుడు, లేదా సహదేవుడుకి సరిపోతాడు. అర్జునుడికి అతన్ని తీసుకోవడం అసాధ్యం. భీముడు అంత కటౌట్ నానికి లేదు. ధర్మరాజు అంటే కాస్త పెద్దరికం కావాలి. అదీ అతని వయసుకు సరిపోదు. ఇక కౌరవుల్లో దుర్యోధనుడి రేంజ్ చాలా పెద్దది. ఆ పాత్రకూ కష్టమే. కర్ణుడు అంటే ఆల్రెడీ ప్రభాస్ అని ఫిక్స్ అయ్యారు కదా మనాళ్లు. అభిమన్యుడు పాత్రకూ అతని వయసు పెద్దదవుతుంది. సో.. నకుల సహదేవుళ్లలో ఎవరో ఒక పాత్రకు సెట్ అవుతాడేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com