Ghaati Movie : అనుష్క ఘాటీ రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన స్పీటీ.. సూపర్ హిట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మళ్లీ తళుక్కున మెరిసింది. ఆ తర్వాత అనుష్క చేసిన మోస్ట్ అవైటెడ్ సినిమానే 'ఘాటీ'. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈచిత్రంలో కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు, దేశీ రాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో అనుష్క.. నెవ్వర్ బిఫోర్ పవర్ ఫుల్ రోల్ లో సందడి చేయనుంది. యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే ఏప్రిల్ 18న సినిమా రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత వాయిదా వేశారు. జులై 11న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ నెలలో కూడా సినిమా పోస్ట్ పోన్ అయినట్లు వినిపిస్తోంది. మూవీలో ఇంకా కొన్ని పనులు బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక కొత్త డేట్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com