Milky Beauty Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లెప్పుడో?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పంజాబీ ముద్దుగుమ్మ తమన్న భాటియా. బాలీవుడ్ లో ఏదో చేసేద్దామని నార్త్ బెల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే టైంలోనే విజయ్ వర్మతో రిలేషన్ స్టార్ట్ చేసింది. ప్రియుడితో షికార్లు చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. బాహుబలి తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, జైలర్, ఆరణ్మనైలతో బాగానే ఆకట్టుకుంది అమ్మడు. తనను క్రేజీ హీరోయిన్ ను చేసిన టాలీవుడ్ పై ఎఫ్ 3 తర్వాత ఫోకస్ తగ్గించింది. టాలీవుడ్ కు డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ మిగతా ఇండస్ట్రీస్ పై దృష్టి పెట్టింది తమన్న. బాలీవుడ్ లో కూడా పెద్దగా బజ్ లేకపోవడంతో రూట్ మార్చి తెలుగు ఇండస్ట్రీలో వాలిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వేస్టేషన్ సీక్వెల్ ఓదెల 2లో నటిస్తోంది. రీసెంట్ గా మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పుడు చూడని స్టన్నింగ్ లుక్స్ లో మె స్మరైజ్ చేసింది తమన్నా బ్యూటీ. ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ లో పిచ్చెక్కించిన భామ.. ఫస్ట్ టైం డివోషనల్ టచ్ ఇస్తుంది. ఓదెల 2లో లేడీ అఘోరిగా కనిపించబోతుంది. ప్రజెంట్ తమ్ము చేతిలో ఓదెల 2 ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. సినిమాలతో తెలుగులో బిజీగా మారుతుందా? లేక కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకుండా విజయ్ వర్మతో ఏడ డుగులు వేయబోతోందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com