Preethi Mukundan : కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ ఎక్కడ?

Preethi Mukundan : కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ ఎక్కడ?
X

కన్నప్ప సినిమా సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రమోషన్లను కూడా వేరే లెవల్లో చేశారు. ముంబైలో టీజర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుండి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు సక్సెస్ ఫుల్ గా సాగిపో యింది. విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్పను రెండేళ్ల క్రితం అఫీషియల్గా లాంచ్ చేశాడు. ఇంత జరిగిన ఈ సినిమా హీరోయిన్ ప్రీతి ముకుందన్ ప్రమోషన్స్ కు ముఖం చాటేసింది. సినిమా ప్రమోషన్లలో ఆమె కనిపించడం లేదు. ఈ అమ్మడి పేరు కూడా పెద్దగా వినిపించడం లేదు. కన్నప్ప విష్ణుకే కాదు ప్రీతి ముకుందన్ కు మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఈ అమ్మడు కేవలం రెండు సినిమాల్లోనే నటించింది. ఆమెకు ఇది మూడో సినిమా మాత్రమే. ఈ సినిమా హిట్ పడితే హ్యాట్రిక్ బ్యూటీ, గోల్డెన్ లేడీ, లక్కీ గర్ల్ అన్న బిరుదులు వచ్చేస్తుంటాయి. అలాంటిది ప్రీతి ముకుందన్ ఎక్కడా ప్రమోషన్లతో పాటు ఎలాంటి ఇంటర్వ్యూల్లోనూ పాల్గొనలేదు. కాజల్ద చిన్న రోల్ కాబట్టి లైట్ తీసుకుంది అనుకుంటే ప్రీతి ఎందుకు స్కిప్ చేసిందో క్లారిటీ రాలేదు. చివరకు స్మాల్ రోల్స్ చేసిన మమ్ముట్టి, అక్షయ్ కుమార్, మధుబాల కూడా పలు ఈవెంట్లలో హాజరయ్యారు. కానీ ప్రతీముకుందన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రీతి ముకుందన్ ది తమిళనాడు. తిరుచ్చి జిల్లాలో జూలై 30, 2001లో ప్రీతి జన్మించింది. ఆమె పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. బీటెక్ చదువుకున్న ప్రీతి సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఈ రంగంలోకి వచ్చింది. కన్నప్ప కంటే ముందు నటించిన తెలుగు సినిమా మరొకటి ఉంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘ఓం భీం భుష్’ మూవీలో నటించింది. ఈ మూవీలో ఆమె తన గ్లామర్ ను బాగానే ఆరబోసింది. విష్ణుకు జోడీగా నటించడం.. డ్యాన్సులు, గ్లామర్ ను బాగానే చూపించడంతో ఆమె తన ట్యాలెంట్ ను చూపించింది.

Tags

Next Story