Neha Shetty : ఎక్కడున్నవ్ రాధికా... కొత్త సినిమా ఎప్పుడు?

Neha Shetty : ఎక్కడున్నవ్ రాధికా... కొత్త సినిమా ఎప్పుడు?
X

డీజే టిల్లు సినిమాతో రాధిక గా ఫేమస్ అయి పోయిన నేహాశెట్టి ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. ఈ అమ్మడికి సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్దగా ఉండటం లేదు. డీజే టిల్లులో హీరోని మోసం చేసే పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. రాధిక అంటే బ్యాడ్ గర్ల్ ఇమేజ్ సెట్ అయిపోయేలా ఆ క్యారెక్ట ర్ ను సెట్ చేసిందీ అమ్మడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ ఊపుని కొనసాగించలేకపోయాయి. 'బెదురులంక', 'రూల్స్ రంజన్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. 'మెహబూబా' సినిమాతో టాలీవుడ్లోకి గుపెట్టిన నేహా శెట్టి, ఇప్పటివరకు మిడ్డేం జ్ హీరోలతోనే జత కట్టింది. సందీప్ కిషన్ తో 'గల్లీ బాయ్', అఖిల్తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల ర్', సిద్ధూ జొన్నలగడ్డతో ‘టిల్లు’, కార్తీకేయతో ‘బెదురులంక', కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్', విశ్వక్ సేన్తో 'గ్యాంగ్స్ ఆఫ్ గో దావరి'లో నటించింది. ఈ సినిమాలన్నింటిలో నూ డీజే టిల్లు తప్ప వద్ద మిగతావన్నీ డిజాస్టర్ అయ్యాయి. గ్లామర్, నటనలో రాణిస్తూ, తన పూర్తి సామర్థ్యా న్ని చూపించినప్ప టికీ, ఆమెకు సరైన విజయం దక్కడం లేదు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. కానీ కొత్త సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తోందని, అలాగే రిషబ్ శెట్టి రాబోయే చిత్రాల్లో ఒకదానిలో హీరోయిన్ గా కనిపించనుందని వదంతులు వస్తున్నాయి తప్ప క్లారిటీ రావడం లేదు.

Tags

Next Story