Prabhas : ప్రభాస్ కు విలన్ ఎవరు..?

Prabhas  :  ప్రభాస్ కు విలన్ ఎవరు..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీస్ ఈ సారి బలంగా ఉండేలా ఉన్నాయి. బాహుబలి తర్వాత ఒక్కటీ సరైన పెద్ద బ్లాక్ బస్టర్ పడలేదు. సలార్ మాత్రం బావుంది అనిపించుకుంది. బట్ ఈ మూవీ నచ్చని వాళ్లు కూడా ఉన్నారు. అందుకే రూట్ మార్చాడు. ఈ సారి బలమైన కథలు, దర్శకులతో పని చేస్తున్నాడు. అందులో భాగంగా స్పిరిట్ మూవీ ఉండబోతోంది. మరోవైపు ఫౌజీ ఇప్పటి వరకు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కల్కి 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్పిరిట్ వేగంగా చిత్రీకరణ చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా తృప్తి దిమ్రీ నటించబోతోంది. మరి విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనే పాయింట్ వద్ద ఆగింది.

స్పిరిట్ లో విలన్ గా కొరియన్ స్టార్ డాన్ లీ నటించబోతున్నాడు అనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. బట్ అందులో నిజం లేదు. డాన్ లీని విలన్ గా తీసుకోవాలనుకోవడం లేదు. కాకపోతే బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించబోతున్నాడు అనేది మాత్రం తేలింది. వివేక్ ఆల్రెడీ విలన్ గా చాలా మూవీస్ లో చేస్తున్నాడు. అతను ఈ పాత్రకు రైట్ ఛాయిస్ అనే సందీప్ రెడ్డి వంగా అనుకున్నాడు. వివేక్ నే విలన్ గా చేయబోతున్నాడు. అయితే ఈ మూవీలో డాన్ లీ ఓ కేమియో రోల్ చేయబోతున్నాడు అనేది క్లియర్ గా వినిపిస్తూనే ఉంది. ఈ మేరకు అతన్ని ఆల్రెడీ సంప్రదింపులు చేస్తున్నారట. అతను కూడా ఓకే చెప్పే అవకాశాలు చాలానే ఉన్నాయి అంటున్నారు. అదీ మేటర్. మెయిన్ విలన్ గా వివేక్ ఒబెరాయ్ కన్ఫార్మ్. కేమియో రోల్ లో డాన్ లీ నటించే అవకాశాలున్నాయి.

Tags

Next Story