Rashmika : రష్మిక పెళ్లి చేసుకునేది ఎవరినంటే?

నేషనల్ క్రష్ రష్మిక తెలుగు ఇండస్ట్రీ హీరోనే పెళ్లి చేసుకుంటుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె ఇంకా రివీల్ చేయలేదని తెలిపారు. గత కొన్నేళ్లుగా రష్మిక ఓ యంగ్ హీరోతో రిలేషన్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారానికి రష్మికనే ఎండ్ కార్డు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు గర్ల్ ఫ్రెండ్, సికందర్ సినిమాల్లో నటిస్తున్నారు.
అయితే.. టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి అనగానే.. అందరికీ గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. కొంతకాలంగా ఈ జోడీపై ప్రేమ రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరూ కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించిన ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్ డేస్ ని కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తూ వచ్చింది. ఇక తాజాగా బాలయ్య నిర్మాత నాగ వంశీతో అన్న ఒక్క మాటతో వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయినట్టే అని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com