Kangana Emergency Film : ఆ ప్రతిపక్ష నేత ఎవరు..? ఆ సంతకం ఎవరిది ?

Kangana Emergency Film : ఆ ప్రతిపక్ష నేత ఎవరు..? ఆ సంతకం ఎవరిది ?
X

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ నటించి, నిర్మించిన సినిమా ఎమర్జెన్సీ. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఇతి వృత్తంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. థియేటర్లలో పెద్దగా ఆధరణ సొంతం చేసుకోలేక పోయింది. దేశవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా దారుణమైన వసూళ్లు నమోదు చేసింది. గతంలో కంగనా చేసిన సినిమాల వసూళ్లతో పోల్చితే ఎమర్జెన్సీ సినిమా వసూళ్లు చాలా చాలా తక్కువ. ఓటీటీ వేదికగా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా కంగనాను ప్రశంసిస్తూ సినిమా గురించి కామెంట్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఒకరు ఎమర్జెన్సీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ, చాలా బాగుంది అంటూ అభినందించారంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఆ లేఖను ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం విశేషం. కాంగ్రెస్ నాయకులు ఈ సినిమాపై కొన్నాళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు సినిమా బాగుంది అంటూ కంగనాకు ప్రశంస లేఖ రాయడం చర్చనీయాంశమైంది. కంగనా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన లేఖలో.. నిన్న ఎమర్జెన్సీ సినిమాను చూశాను. మీరు చాలా బాగున్నారు. లవ్ అని తడి సైన్ ఉంది. ఈ లేఖతో తన మొహంలో చిరునవ్వు వచ్చిందని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా ఎమర్జెన్సీని ప్రశంసించిన ఆ ప్రతిపక్ష నేత ఎవరు..? ఆ సంతకం ఎవరిది అని వెతికే పనిలో పడిపోయారు నెటిజెన్లు.

Tags

Next Story