Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు సారీ చెప్పిన ఆ నటుడెవరు?

మిల్కీ బ్యూటీ తమన్న తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో పరిస్థితిని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అన్ని భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ వెబ్ సిరీస్ లలోనూ అలరిస్తోందీ పంజాబీ భామ. తాను చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపింది. 'స్టార్ హీరోలు నాకు ఇండస్ట్రీ గురించి తె లియదనుకొని నా విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసే వారు. చాలా సార్లు అవమానం జరిగింది. ఓ పెద్ద సౌత్ స్టార్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు అసౌకర్యంగా అనిపించేది. దర్శకనిర్మాతలకు నాకు ఇబ్బందిగా ఉందని, చేయలేనని చెప్పా. అప్పుడు ఆ అగ్రహీరో 'హీరోయిన్ ను మార్చండి' అని నాపై కేకలు వేశాడు. ఎవరైనా మనల్ని అవమానించారని బాధపడుతూ మనం కూడా తిరిగి వాళ్లతో అలా ప్రవర్తించకూడదని మౌనంగా ఉన్నాను. ఆయన మరుసటిరోజు తనంతట తానే నా వద్దకువచ్చి క్షమాపణలు చెప్పాడు. తనకు కోపం వచ్చిందని అందుకే అరిచినట్లు తెలిపాడు. నాతో అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాప పడ్డాడు” అని తమన్నా తెలిపారు. అయితే, ఆ బిగ్ సౌత్ర్ పేరు మాత్రం ఆమె చెప్పలేదు. ఆ స్టార్ హీరో ఎవరనేది నెట్టింట వెతికేస్తున్నారు మిల్కీ బ్యూటీ అభిమానులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com