Box office war : ఈ ముగ్గురిలో విన్నర్ ఎవరో..?
బాక్సాఫీస్ కు కళ తగ్గుతోంది. వస్తోన్న సినిమాలేవీ అంచనాలను అందుకోవడం లేదు. కాకపోతే కొన్ని చిన్న సినిమాలు మాత్రం మెరుస్తున్నాయి. అది కూడా చాలా రేర్ గా. ఇక ఈ వారం కూడా మూడు తెలుగు సినిమాలున్నాయి. శుక్రవారం రోజున వస్తోన్న ఈ మూవీస్ లో అందరికంటే ఎక్కువగా ఆకట్టుకుంటోన్న మూవీ మత్తు వదలరా 2. శ్రీ సింహా కోడూరి, సత్య, ఫారియా అబ్దుల్లా, రోహిణి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని ఓ రేంజ్ లోప్రమోట్ చేశారు. ఏకంగా ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా రెండు ఇంటర్వ్యూస్ కూడా చేశాడు. రాజమౌళి సైతం ఓ ఇంటర్వ్యూ చేశాడు. దీనికి తోడు ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ఇంతకు మించి ఫస్ట్ పార్ట్ హిట్ అయి ఉంది. ఇవన్నీ మత్తు వదలరా 2కి పెద్ద ప్లస్ అవుతున్నాయి.
ఇక కొన్నాళ్లుగా దండయాత్ర చేస్తోన్న రాజ్ తరుణ్ ఈ సారి భలే ఉన్నాడే అంటూ వస్తున్నాడు. శివసాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మనీషా కంద్ కూర్ హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ బావుంది. కొత్త కాన్సెప్ట్ లా కనిపిస్తోంది. హీరో మగాడా కాదా అనే డౌట్ చుట్టూ అల్లుకున్న కథలా కనిపిస్తోంది. కాకపోతే రాజ్ తరుణ్ కు ఓపెనింగ్స్ ఎప్పుడో పోయాయి. సినిమా చాలా బావుండి మౌత్ టాక్ వస్తే అప్పుడు కలెక్షన్స్ పెరుగుతాయేమో.
ఇక మరో మూవీ ఉత్సవం. అర్జున్ సాయి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా మెయిన్ లీడ్ చేస్తున్నా.. తెరంతా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, ఆమని, ప్రేమ వంటి బాగా తెలిసిన సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులున్నారు. దీంతో ట్రైలర్ కే నిండుదనం వచ్చింది. నాటక సమాజంలోని నటుల జీవితం చుట్టూ సాగే కథలా కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ అయితే బాగా ఆకట్టుకుంది. నాటకీయత లేకుండా ఉంది.
సో.. ఈ మూడు తెలుగు సినిమాల మధ్య మరికొన్ని గంటల్లో పోటీ ఉండబోతోంది. మరి ఈ పోటీలో అందరూ నెగ్గాలని కోరుకున్నా.. అసలంటూ విజేత అని ఒక్కరే నిలుస్తారు కదా. ఆ ఒక్కరూ ఎవరో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com