Imanvi, Prabhas : ప్రభాస్ కొత్త హీరోయిన్ ఎవరు..?

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందబోతోన్న మూవీ పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభం అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఓపెనింగ్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిందో సోయగం. తనే ప్రభాస్ హీరోయిన్. అయితే ఇంతకు ముందెప్పుడూ చూసిన ఫేస్ కాదు. వేరే భాషల్లో కూడా నటించినట్టు లేదు. అందుకే ఎవరికీ పెద్దగా తెలియలేదు. ఈ ఓపెనింగ్ తర్వాత అమ్మడి గురించి ఆరా తీస్తే తన పేరు ఇమాన్వి అని తేలింది.
పేరును బట్టి ముస్లీం అని తెలుస్తోంది కదా. అంతే కాదు.. తను పాకిస్తాన్ లో పుట్టిన అమ్మాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ వస్తుందా అని అంతా ఎదురుచూస్తోంటే అందరికీ షాక్ ఇస్తూ హను రాఘవపూడి ఈ కొత్తమ్మాయిని తీసుకువచ్చాడు. ఫస్ట్ మూవీతోనే ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు పరిచయం అయ్యే అదృష్టం ఇమాన్వికి దక్కింది.
ఇక సోషల్ మీడియా కాలం కదా.. ఇమాన్వి ఇన్ స్టాగ్రామ్ చూస్తే అమ్మడు అద్భుతమైన డ్యాన్సర్ అని తెలిసింది. తను ఫ్లోర్ పై మూమెంట్స్ ఇస్తుంటే హోరెత్తిపోతోంది. ఓపెనింగ్ రోజున చీరకట్టులో సంప్రదాయంగా కనిపించిన తనలో ఇంత గ్రేట్ డ్యాన్సర్ ను చూసి ఆశ్చర్యపోతున్నారంతా. ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి సడెన్ గా డ్యాన్స్ వేస్తే ఎలా షాక్ అయ్యారో అచ్చం అలా అన్నమాట. విశేషం ఏంటంటే.. తను మంచి కొరియోగ్రాఫర్ కూడా. సినిమాలో పాత్ర ఎలా ఉంటుందో కానీ చూస్తుంటే హుషారైన పిల్లలా ఉంది. మరి ఈ బ్యూటీ ఈ మూవీతో ఎలాంటి స్థాయికి చేరుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com