Disha Patani : దిశాకు మళ్లీ నిరాశేనా..?

ఏ హీరోయిన్ అయినా ప్యాన్ ఇండియా సినిమాలో ఆఫర్ వస్తే ఎగిరి గంతేస్తుంది. అది కూడా ప్రభాస్ లాంటి స్టార్ సరసన అంటే ఇంక తన ఫేట్ మారిపోయినట్టే అని ఫీల్ అవుతుంది. అలాగే ఫీలయింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. అమ్మడు కల్కిసినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు అంతులేని ఆనందం వ్యక్తం చేసింది. తీరా సినిమాలో తన పాత్ర చూస్తే కరివేపాకులా కనిపించింది. తన వల్ల సినిమాకు, సినిమా వల్ల తనకు అస్సలేమాత్రం ప్రయోజనం కనిపించలేదు. కల్కిపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఈ బ్యూటీకి తీవ్ర నిరాశే మిగిలింది. సెకండ్ పార్ట్ లో కూడా ఏమంత అవకాశం ఉండే ఛాన్స్ కనిపించడం లేదు.
ఇక ఇప్పుడు మరోసారి కంగువాతో రాబోతోంది. బట్ ఈ మూవీ కంటెంట్ చూస్తుంటే అమ్మడికి మరోసారి కరివేపాకు లాంటి పాత్రే దక్కిందేమో అనిపిస్తోంది. ఏ కంటెంట్ లో కూడా తను కనిపించలేదు. రెండు ట్రైలర్స్ లో కూడా తనను పట్టించుకోలేదు. అస్సలు దిశా పటానీ ఈ మూవీలో ఉందా అనేలాగా ఆమెకు సంబంధించిన ఏ కంటెంట్ కూడా ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. ఇంక దిశా కూడా ముంబై, తెలుగు స్టేట్స్ ప్రమోషన్స్ వరకు ఉత్సాహంగానే పాల్గొన్నా.. ఆ తర్వాత మానేసింది. అంటే తన పాత్ర మరోసారి తేలిపోయిందని ఆమెకు ఎవరైనా చెప్పి ఉండాలి. లేదంటే ఆమె క్యారెక్టర్ గురించి కావాలనే లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నారు అనైనా అనుకోవాలి.
నిజానికి దర్శకుడు శివ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. స్ట్రాంగ్ రైటింగ్ కూడా కనిపిస్తుంది. బట్ కంగువా విషయంలో అదేం కనిపించడం లేదు. అందుకే ప్యాన్ ఇండియా సినిమా అంటూ పెద్దగా కనిపిస్తున్నా.. దిశా పటానికి మరోసారి నిరాశ తప్పేలా లేదు అంటున్నారు ఫిల్మీ ఫోక్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com