Ntr's Devara : ఎన్టీఆర్ ది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ..

Ntrs Devara  :   ఎన్టీఆర్ ది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాయబోతున్నాడు. దేవర రిలీజ్ టైమ్ లో ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. యస్.. ఆ ఎగ్జామే దేవర. దేవరతో అతనో పరీక్షకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా సినిమా రిజల్ట్ ను తెలిపేలా ఉంటుంది. ఈ రిజల్ట్ ను బట్టి ఫైనల్ ఎగ్జామ్ మరింత రసవత్తరంగా మారబోతోంది. ఫైనల్ ఎగ్జామ్ రాసేది ఎవరు అనుకుంటున్నారా.. అది చివర్లో చూద్దాం. బట్ అసలు సమస్య ఎన్టీఆర్ దేవరకే ఉంది.

దేవర మూవీతో ఆరేళ్ల తర్వాత సోలోగా ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు ఎన్టీఆర్. మామూలుగా ఎన్టీఆర్ స్టామినాకు.. ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. బట్ కొన్నాళ్లుగా అతను పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ అయ్యాడు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి. మూడేళ్లుగా ఎన్టీఆర్ తన నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. వాళ్లూ దూరం పెట్టారు అనే టాకూ ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ ను డిస్ ఓన్ (Disown)చేసుకున్నారు అనేది నిజం. పెద్దాయన శత జయంతి ఉత్సవాల నుంచి ఈ రచ్చ మరింత పెరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు సతీమణి తనకు మేనత్త వరస కూడా అయ్యే భువనేశ్వరి పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఫ్యామిలీ అంతా స్పందించింది. బట్ ఎన్టీఆర్ స్పందన భిన్నంగా ఉండటంతో విమర్శలు వచ్చాయి. ఇక బాలయ్య తన 50యేళ్ల సినిమా ఫంక్షన్ కూ పిలవలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమికి లీడర్ టిడిపియే. అందుకే అక్కడ దేవరకే పూర్తి మద్ధతు దొరుతుందా లేదా అనేది ఈ మూవీతో తేలిపోతుంది.

చంద్రబాబు గెలిచినప్పుడు ఎన్టీఆర్ ఆయనతో పాటు లోకేష్ కూ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. దానికి వాళ్లు థ్యాంక్స్ చెప్పారు. రీసెంట్ గా వరదల టైమ్ లో అందరికంటే ముందు తనే స్పందించాడు. మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇవన్నీ డ్యామేజ్ కంట్రోల్స్ అనే చెబుతున్నారు తప్ప.. నిజంగా ఎన్టీఆర్ ను కొందరు తెలుగుదేశం అభిమానులు నమ్మడం లేదు. ఎంత లేదన్నా.. జూనియర్ కు ఎక్కువ బలం ఇక్కడే ఉంది. ఆ జోన్ వీక్ అయితే దేవరకు మైనస్ అవుతుంది. మరి వాళ్లంతా సినిమాను ఆదరిస్తే ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లో ఎన్టీఆర్ నెగ్గుతాడు. లేదంటే ప్రాబ్లమ్స్ తప్పవు.

ఇక ఎన్టీఆర్ లాగానే అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఉంది. ఎన్టీఆర్ కు ఇబ్బంది లేకుండా ప్రీ ఫైనల్ లాంటి ఎగ్జామ్ లో సక్సెస్ అయితే దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేది పుష్ప 2నే. అల్లు అర్జున్ పైనా ఆంధ్ర ప్రదేశ్ లో చాలామంది ఆగ్రహంగా ఉన్నారు. అతను మెగా ఫ్యామిలీకి ద్రోహం చేశాడు అనే కోణంలో ఏకంగా జనసేన నాయకులు బాహాటంగానే ఈ సినిమాను అడ్డుకుంటాం అని ప్రకటిస్తున్నారు. మొత్తంగా దేవరకు ఇబ్బందులు లేకుండా హిట్ అయితే.. పుష్ప 2 కు కాస్త లైన్ క్లియర్ అవుతుంది.



Tags

Next Story