సమంత పెళ్లిపై మళ్లీ ట్రోల్స్.. ఏంటిది..?

సమంత పెళ్లిపై మళ్లీ ట్రోల్స్.. ఏంటిది..?
X

సమంత శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే ఆమెను మళ్లీ ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా ఇది అవసరమా. ఏ సెలబ్రిటీకి అయినా లేదంటే రాజకీయ నాయకులకు అయినా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటారు. అందులో తప్పేముంది. గతాన్ని పట్టుకొని ప్రస్తుతానికి అనువయిస్తూ తిట్టడం మంచిది కాదేమో. మనకు తెలిసిందే కదా సమంత నాగచైతన్య 2021లో విడిపోయినప్పుడు ఎంత ఘోరంగా సమంతను ట్రోల్ చేస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ కామెంట్లు చేశారో చూశాం. సమంత మీద వచ్చినన్ని విమర్శలు ఇంకెవరి మీద రాలేదేమో. ఫ్యామిలీ మెన్ 2 లో బోల్డ్ గా నటించడం వల్లే విడాకులు అయ్యాయని కొందరు.. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉండటం వల్లే చైతన్య విడాకులు ఇచ్చాడంటూ ఇంకొందరు రూమర్లు క్రియేట్ చేశారు.

ఏదేమైనా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. నాగచైతన్య రీసెంట్ గానే శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ దారుణం ఏంటంటే అప్పుడు కూడా నాగచైతన్యను ఎంతో మంది ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు పెట్టారు. సమంతకు అన్యాయం చేశాడని కొందరు.. వేణు స్వామి లాంటి వారైతే పెళ్లి అయిన ఏడాదికే విడిపోతారంటూ శాపనార్ధాలు పెట్టాడు. వేణు స్వామిపై టీవీ5 ఏ స్థాయిలో స్పందించిందో కూడా మనం అప్పట్లో చూశాం. ఎందుకంటే ఒక జంట పెళ్లి చేసుకుంటే కలకాలం కలిసి ఉండాలి అని అందరూ కోరుకోవాలి. అంతేగానీ ఇలా విడిపోతారు అనడం ఎంతవరకు కరెక్ట్. వాళ్లను ట్రోల్ చేయడం అస్సలు మంచిది కాదు. ఇప్పుడు సమంత కూడా తన రూమర్డు బాయ్ ఫ్రెండ్ రాజ్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కూడా సమంతను వదలకుండా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

సమంత రాజ్ తో డేటింగ్ చేయడం వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని.. ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుని రూమర్స్ ను నిజం చేసింది అంటూ కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు. సమంత నాగచైతన్య ఇష్టపూర్వకంగానే విడిపోయి ఎవరి పెళ్లిళ్లు వారు చేసుకున్నారు. ఇది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఎంత సెలబ్రిటీ అయినంత మాత్రాన ఇంత ఘోరంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ నాగచైతన్య కూడా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి సమంత పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. కుదిరితే ఆమెకు విషెస్ చెప్పాలి గాని ఇలా ట్రోల్స్ చేస్తూ ఆమె లైఫ్ లో మంచి మూమెంట్ జరుగుతున్నప్పుడు చెడుగా కామెంట్లు పెట్టడం సమంజసం కాదు. కాబట్టి ఆమెను ఇప్పటికైనా వదిలేసి ఆమె లైఫ్ లో మంచి సక్సెస్ కావాలని అందరం కోరుకుందాం.


Tags

Next Story