Akshara Gowda : అక్షర గౌడకు ఆఫర్లు దక్కేనా?

‘ఉయర్తిరు 420' మూవీతో ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అక్షర గౌడ. తక్కువ టైంలోనే కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లోనూ ఈ అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందాల ఆరబోతతో టాలీవుడ్లో నూ అడుగుపెట్టిన ఈబ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు. తెలుగులో ఈ అమ్మడు చేసిన మన్మథుడు 2, ది వారియర్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ దాస్ కా ధమ్కీ చిత్రంలో విశ్వక్ సేస్తో కలిసి నటించే ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్సా ఫీస్ వద్ద ఆడలేదు. దాంతో టాలీవుడ్లో ఈ అమ్మడికి కొత్త సినిమాల్లో నటించే అవకాశా లు వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టైలిష్ ఫోజ్ ఇచ్చి నడుము అందాన్ని చూపిస్తూ డిజైనర్ నెక్లెస్ను ధరించిన అక్షర.. కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఇంత గ్లామర్ గా ఉన్నా సరిగ్గా ఆఫర్లు దక్కడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కేనా అనేది చూడాలి. చివరగా గతేడాది హరోం హరంతోనూ అవకాశాన్ని దక్కించుకుంది అక్షర.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com