Munna Movie : మున్నా రీ రిలీజ్ లో అయినా వర్కవుట్ అవుతుందా..?

రీ రిలీజ్ ట్రెండ్ కూడా పడిపోయింది. పాత సినిమాలైతే ఓకే. ఈ మధ్యే వచ్చిన సినిమాలను కూడా రీ రిలీజ్ లు చేస్తున్నారు. అంటే ఓ ఇరవై యేళ్ల క్రితం నాటి మూవీస్ అంటే ఓకే కానీ ఈ మధ్య కాలంలో అయితే ఇబ్బంది అవుతోంది. అలాగే ఏ కాలంలో అయినా ఆ సినిమాల కంటెంట్ ను బట్టి రీ రిలీజ్ లో కూడా విజయం సాధిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో చేసిన మూవీ మున్నా కూడా రీ రిలీజ్ అవుతోంది. ఈ నెల 6న ఈ మూవీని మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓ డిఫరెంట్ కథతో రూపొందింది ఈ సినిమా. కథనం చాలా స్టైలిష్ గా ఉంటుంది. బట్ కంటెంట్ మరీ అంత గొప్పగా ఏం ఉండదు. ఈ కారణంగా ఫస్ట్ రిలీజ్ చేసిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. పైగా అప్పుడేమో ఒక మూడు రోజుల్లోనే సినిమా రిజల్ట్ తేలిపోయే టైమ్ కాదు కూడా. లాంగ్ రన్ అవకాశం ఉంది. అయినా ఈ మూవీ షార్ట్ గానే ఆడింది.
మున్నాతో దర్శకుడు వంశీ పైడిపల్లి పరిచయం అయ్యాడు. దర్శకుడుగా అతను ఓకే అనిపించుకున్నాడు. రిజల్ట్ తేడా కొట్టింది. బట్ మేకింగ్ లో అతనికంటూ ఓ స్టైల్ ఉంది అని అర్థం అయింది. అందుకే తర్వాతి మూవీ బృందావనంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక హీరోయిన్ గా ఇలియానా బాగా ఫేమ్ లో ఉన్న టైమ్ లో చేసిన మూవీ ఇది. హ్యారీస్ జయరాజ్ సంగీతంలో ఒకట్రెండు పాటలు బానే ఉన్నాయి. ఓవరాల్ గా ఇదో యావరేజ్ మూవీ. మరి ఇలాంటి మూవీని మళ్లీ విడుదల చేయడంలో ఉండే ప్రత్యేకతలేంటీ అనేది చూడాలి. ఒకవేళ ఈ మూవీ ఈ సారి జెన్ జీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందేమో.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
