Nabha Natesh : నభా నటేశ్ కు ఆఫర్లు దక్కేనా!

వజ్రకాయ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి 2015లో అడుగుపెట్టంది కన్నడ బ్యూటీ నభానటేశ్. ఆ సినిమాతో కన్నడంలో మంచి గుర్తింపు దక్కించుకుంది. నన్ను దోచుకుందువటే చిత్రంతో 2018లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లీ, సాహెబ్ సినిమాలు చేసింది. అవి కూడా కన్నడ ముద్దు గుమ్మరకు పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చిపెట్టాయి. ఇక ఇస్మార్ట్ శంకర్లో ఈ అమ్మడు పోషించిన మాస్ పాత్రకు మంచి మార్కులు దక్కాయి. ఈ సినిమాతో ఈమెకు ఇస్మార్ట్ బ్యూటీ అనే పేరు దక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. గత ఏడాది డార్లింగ్ అనే వెబ్ మూవీలో తన నటనతో మరోసారి మెప్పించింది. అయినా ఆఫర్లు మాత్రం తలుపు తట్టడం లేదు. తాజాగా ఈ బ్యూటీ తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. వైట్ టాప్ లో నడుము అందం చూపిస్తూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ ఫొటోలకు అందరూ ఫిదా అవుతున్నారు. లైక్లు, కామెంట్లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com