Khaidi-2 : ఖైదీ-2లో రజీషా?.. హ్యాట్రిక్ పడుతుందా?

లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తున్న సినమా ఖైదీ-2. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కనగరాజ్ కూలీ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటంగ్ పూర్తవగానే ఖైదీ - 2 వర్క్ స్టార్టవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రజీషా విజయన్ నటించబోతోందని టాక్ ఉంది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా కథలో ఎంతో కీలకంగా తన పాత్ర ఉండనున్న ట్లు తెలిసింది. రజిషా ఇప్పటికే కార్తితో కలిసి 'సర్దార్' సినిమాలో సందడి చేసింది. అలాగే ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా ముస్తాబవుతున్న 'సర్దార్ 2'లోనూ నటి స్తోంది. ఇప్పుడీ ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే కార్తితో రజిషాకు ఇది మూడో సినిమా అవుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లుందనే టాక్ ఉంది. ప్రస్తుతం రజీషా విజయన్ బైసన్ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో ద్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో మెయిన్ లీడ్ మాత్రం అనుపమ పరమేశ్వరన్ పోషిస్తుంది. సెకెండ్ లీడ్ లో రజీషా ఎంపికైనట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com