Disha Patani : దిశాకు సూర్య లిఫ్ట్ ఇస్తాడా

Disha Patani :  దిశాకు సూర్య లిఫ్ట్ ఇస్తాడా
X

2015లోనే తెలుగు మూవీ లోఫర్ తో వెండితెరకు పరిచయం అయింది దిశా పటానీ. పూరీ జగన్నాథ్ ఇంటర్డ్యూస్ చేసిన ఈ బ్యూటీకి ఫస్ట్ మూవీతోనే డిజాస్టర్ పడింది. దీంతో తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కాకపోతే బాలీవుడ్ లో అడుగులు పడ్డాయి. హిట్స్ ఉన్నా లేకున్నా ఆఫర్స్ మాత్రం కంటిన్యూస్ గా వచ్చాయి. అందుకే నాన్ స్టాప్ గా అక్కడ సినిమాలు చేస్తూ వస్తోంది. కాకపోతే సౌత్ లో పాగా వేయాలనుకున్న దిశా ఆశలక మళ్లీ కల్కి హోప్స్ ఇచ్చింది. బట్ ఈ మూవీలో తను మరీ జూనియర్ ఆర్టిస్ట్ తరహా పాత్ర చేసింది. ఆ పాత్రకంటూ ఏ గుర్తింపూ లేదు. గుర్తు పెట్టుకునేంత స్పేస్ కూడా లేదు. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ మూవీతో మళ్లీ జెండా పాతాలన్న కల మళ్లీ చెదిరింది. ఈ సినిమా తనకు ఏ భాషలోనూ గుర్తింపు తేలేదు.

అయితే ఇప్పుడు తమిళ్ మూవీ కంగువాతో మరోసారి తన లక్ ను చెక్ చేసుకుంటోంది దిశ. సూర్య హీరోగా శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో నవంబర్ 14న విడుదల కాబోతోంది. రీసెంట్ గానే బాలీవుడ్ లోనూ ప్రమోషన్స్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు కంగువాపై మరోసారి బోలెడు ఆశలు పెట్టుకుంది దిశా పటాని. స్కిన్ షో విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేని ఈ బ్యూటీ మరీ అస్సలు టాలెంట్ లేనిదైతే కాదు. నటన పరంగా తన టాలెంట్ రెండో సినిమా ధోనీలోనే చూపించింది. బట్ తనకు నటించే అవకాశాల కంటే ఎక్స్ పోజ్ చేసే పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి. ఏదేమైనా కంగువా తో హిట్ కొట్టి.. కల్కి లా కాకుండా ఇందులో తన పాత్రకు మంచి గుర్తింపు వస్తే సౌత్ లో మరిన్ని అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. మరి ఈ సారైనా అమ్మడు సాధిస్తుందా లేదా అనేది చూద్దాం.

Tags

Next Story