Chava Movie : ఈ క్షమాపణలతో వారసులు శాంతించేనా?

ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం 'ఛావా'. విక్కీ కౌశల్, రష్మిక లీడ్ రోల్లో.. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ 10 రోజుల్లోనే బాక్సా ఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లతో దూసు కెళ్తంది. అయితే ఈ సినిమా విషయంలో గానోజీ, కన్జజీ షిర్కే వారసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. చిత్రంలో తమ పూర్వీకుల ను తప్పుగా చూపించి అవమానించారని ఆరోపించారు. తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసారని, రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని షిర్కే వారసులు వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ కు నోటీసులు పంపించారు. దీనిపై స్పందిం చిన ఆయన వారి కుటుంబీకులకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. గానోజీ, కన్జజీలను తప్పుగా చూపించే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని స్పష్టంచేశారు. అందుకే వారికి సంబం ధించిన వివరాలు, వారు ఏ ప్రాంతానికి చెం దినవారు అనే విషయాలను సినిమాలో తాను ఎక్కడా చూపించలేదని చెప్పారు. సినిమాని కేవలం సినిమాగా చూడాలని...వ్యక్తిగతంగా భావించొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే లక్ష్మణ్ చెప్పిన ఈ క్షమాపణలతో షిర్కే వారసులు శాంతిస్తారా? లేదా చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతారా? అన్నది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com