Tollywood Actors : ఈ ఏడాదిలో విజయ్, రష్మిక పెళ్లి?

Tollywood Actors : ఈ ఏడాదిలో విజయ్, రష్మిక పెళ్లి?
X

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే రూమర్ నెట్టింట చాలాకాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ ఓపెన్ గా చెప్పలేదు. సమయం వచ్చినప్పడు తన ప్రేమ, పెళ్లి విషయాలు బయటపెడతానని విజయ్ అంటుండగా.. రష్మిక మాత్ర ఇప్పట్లో పెళ్లి ఆలోచననే లేదని చెబుతోంది. ఆమె దీపావళి పండుగను విజయ్ దేవర కొండ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం.. ఇద్దరూ కలిసి ముంబైకి వెకేషన్ కు వెళ్లడం కెమెరాలకు చిక్కడం వైరల్ గా మారింది. తాజాగా యంగ్ ప్రొడ్యుసర్ నాగవంశీ.. రష్మిక ప్రేమాయణంపై స్పందించాడు. రష్మిక లవ్ మేటర్ తనకు తెలుసన్నాడు. ప్రస్తుతం రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతన్నే పెళ్లి చేసుకుంటుందన్నాడు. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్' లో నాగ వంశీ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 'నువ్వు చెప్పకపోయినా ఆ తెలుగు హీరో మాకు తెలుసు', 'రష్మిక లవ్ చేస్తున్నది విజయ్ దేవరకొండనే' అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. 2025లో వీళ్లిద్దరి పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా విజయ్ దేవరకొండ, రష్మిక విషయాన్న రివీల్ చేస్తారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.


Tags

Next Story