Ananya – Janhvi Kapoor : ప్రేమతో నీ అనన్య.. జాన్వీకి సర్ప్రైజ్ గిఫ్ట్

సినీ ఇండస్ట్రీలో రైజింగ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న బ్యూటీ జాన్వీ కపూర్.ఇటీవల టాలీవుడ్ లో వరుసగా అగ్రహీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇదే సమయంలో ఈఅమ్మడు తన సంపాదనను తెలివిగా ముంబైలోని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతూ భారీగా లాభాలార్జిస్తోంది. కాగా.. ఈ బాలీవుడ్ ముద్దు గుమ్మను బిర్లా వారసురాలు అనన్య సర్ప్రైజ్ చేసింది. రూ.5 కోట్లు విలువ చేసే పర్పుల్కలర్ లంబో ర్గిని కారును గిఫ్ట్ పంపించింది. ఆ గిఫ్ట్ ప్యాక్పై ‘ప్రేమతో నీ అనన్య' అని రాసి ఉంది. జాన్వీ నివాసాని కి కారు వెళ్తేన్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. జాన్వీ, అనన్య బిర్లా చాలా కాలంగా ఫ్రెండ్స్. బిర్లాల వారసురాలైన అనన్య 2016లో జిమ్ బీన్జ్ నిర్మించిన తన తొలి సింగిల్ 'లివిన్ ది లైఫ్ 'తో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. 'మీంట్ టు బి' సహా అనన్య నెక్ట్స్ సింగిల్స్ విడుదలకు సిద్ధమవుతున్నా యి. భారతదేశంలో ఆంగ్ల భాషా సింగిల్కు ప్లాటినం హోదాను సాధించిన మొదటి భారతీయ కళాకారిణిగా ఈ భామకు గుర్తింపు దక్కింది. అనన్య ఇటీవల సౌందర్య ఉత్ప త్తుల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. దీనికి జాన్వీకపూర్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిం చనున్నట్లు సమాచారం. తన బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్నందుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన కానుకను ఆమెకు పంపించారని వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com