Prabhas and Yash : ప్రభాస్ తో యశ్ ఫైట్

Prabhas and Yash : ప్రభాస్ తో యశ్ ఫైట్
X

బాహుబలితో కేజీఎఫ్ రాకీ భాయ్ తలపడబోతున్నాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద. యస్.. ఇద్దరి సినిమాలూ ఒకే రోజు రాబోతున్నాయి. ఆల్రెడీ ఇద్దరు స్టార్స్ ప్యాన్ ఇండియా హీరోలు అనిపించుకున్నారు. కేజీఎఫ్ కు ముందు యశ్ కన్నడలో టైర్ టూ హీరో మాత్రమే. ఇటు బాహుబలికి ముందు ప్రభాస్ సైతం దాదాపు అదే స్థానంలో ఉన్నాడు. బాహుబలితో డార్లింగ్ వాల్డ్ వైడ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తే కేజీఎఫ్ తో రాకీ భాయ్ గా యశ్ దేశం మొత్తం మెప్పించాడు. ప్రభాస్ అంత కాకపోయినా యశ్ కు కూడా మంచి క్రేజ్ అండ్ ఇమేజ్ వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడానికే కేజీఎఫ్ తర్వాత మరో సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఫైనల్ గా గీతూ మోహన్ దాస్ అనే లేడీ డైరెక్టర్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. 'టాక్సిక్" అనే టైటిల్ తో రూపొందబోతోన్న ఈ మూవీ కాస్టింగ్ కూడా భారీగానే ఉండబోతోంది. యాక్షన్ సీక్వెన్స్ లు డైరెక్ట్ చేయడానికి హాలీవుడ్ నుంచి ఓ టాప్ టెక్నీషియన్ ను రప్పిస్తున్నారు. హీరోయిన్లుగా కియారా అద్వానీ, నయనతార పేర్లు వినిపించాయి. అలాగే హ్యూమా ఖురేషీ ఓ కీలక పాత్ర చేస్తుందని చెప్పారు. బట్ ఇవేవీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు.

గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఇక్కడి నుంచి లండన్ వరకూ సాగే కథనంగా ఈ చిత్రం ఉండబోతోందట. ఇక రేపటి( గురువారం) నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఎక్కువ శాతం లండన్ లోనే చిత్రీకరణ జరుపుకుంటుందని చెబుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని చాలా తక్కువ టైమ్ లోనే ఫినిష్ చేసి ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నారు. యస్.. ఆ రోజు ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ డేట్.

ఇంత పెద్ద స్పాన్ వచ్చిన తర్వాత ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. పైగా దీనికి ముందు రెండు డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయినా మారుతి కథపై నమ్మకంతో రాజా సాబ్ గా నటించేందుకు ఓకే చెప్పాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో మరోసారి ప్రభాస్ లోని రొమాంటిక్ యాంగిల్ ను చూపించబోతున్నారని అర్థం అయింది. రాజా సాబ్ ఏప్రిల్ 10న వస్తోంది. అదే రోజు యశ్ టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుంది. సో.. ఇద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయినట్టే. మరి వార్ లో విన్నర్ ఎవరో అప్పుడే చూద్దాం.

Tags

Next Story