Ramayana Movie : రావణ పాత్రలోకి యష్

'కేజీయఫ్' సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో యష్. తన తదుపరి చిత్రం చేయడానికి ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు. కేజీ యఫ్ స్థాయి కథలు లభ్యం కాకపోవడమే దీనికి కారణం. ఆ తర్వాత ‘టాక్సిక్’ అనే సినిమా కమిటయ్యాడు. ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ఇక పాన్ ఇండియా సినిమాల్లో ప్రాంతీయ హీరోలకు కూడా అవకాశాలు ఉంటాయి ఈ కారణం చేత హిందీలో రూపొందుతున్న రామాయణ్ చిత్రంలో యష్ రావణుడిగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. రబ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ సైతం జరిగింది. తాజాగా యష్ షూటింగ్ పాల్గొంటున్నారని తెలిసింది. ఆయన పోషిస్తున్నది రావణాసురిడి పాత్ర కావడంతో సినిమాపై అంచనాలు అధికంగా ఉన్నాయి. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో విషయం రావణాసుడి పాత్ర పోషణకు ముందుగానే యష్ వివిధ దేవాలయాలను సందర్శిస్తాడని అంటున్నారు. ఆ తర్వాత ముంబైలో రామాయణ్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com