Tollywood : నాగచైతన్యకు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల

అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి డైరెక్షన్‌లో ‘తండేల్’ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య కొత్త మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చై కెరియర్‌లో 24వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం మైథాలజికల్ థ్రిల్లర్‌గా మూవీగా తెరకెక్కబోతున్నట్లు చిత్ర బృదం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘పుష్ప 2’ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా మూవీ మేకర్స్ షేర్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com