Ivana : టాలీవుడ్ ను టార్గెట్ చేసిన యంగ్ బ్యూటీ

'లవ్ టుడే' మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన యంగ్ క్యూటీ ఇవానా గురించి చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమాతో నే అమ్మడు యూత్ అటెన్షన్ డ్రా చేసింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో కుర్రకారులో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. సక్సెస్ పరంగా ఆమె ట్రాక్ బాగుంది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లోనూ పాజిటివ్ గా కనిపిస్తోంది. 'సింగిల్ ' తర్వాత తెలుగులో ఫాలోయింగ్ రెట్టింపు అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ హీరోలతో నటించే పాతికేళ్ల వయసులో ఉంది. ఇక ఎత్తు విష యానికొస్తే.. ఎంత పెద్ద స్టార్ అయినా.. ఎంత హైట్ ఉన్నా సరే మ్యానేజ్ చేస్తానంటూ నమ్మకంగా చెబుతోంది. ఐదు అడుగుల ఎత్తున్న ఈ భామ.. తనకు హైట్ పెద్ద సమస్య కాదంటోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కంటే కాస్త ఎత్తు తక్కువే అయినప్పటికీ.. కెమెరా యాంగిల్ లో ఆమె కంటే ఇవానా ఎత్తుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవానా టాలీవుడ్ ను టార్గెట్ చేసి పని చేస్తున్నట్లు సమాచారం. త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో ఓ చాన్స్ అందుకుం దనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో అవకాశాలు వస్తే ఇక్కడే బిజీ అవ్వాలని కోరుకుంటుంది. మంచి పెర్మార్మర్ యంగ్ హీరోయిన్ గా బాగా సెట్ అవుతుంది. కెరీర్ ఇప్పుడే మొదలై నందున నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది. మరి ఆమెకు టాలీవుడ్ లో ఎంత మేర అవకా శాలు లభిస్తాయో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com