Actor ShriTej : ప్రముఖ నటుడుపై వేధింపుల కేసు పెట్టిన యువతి

Actor ShriTej : ప్రముఖ నటుడుపై వేధింపుల కేసు పెట్టిన యువతి
X

సినీ న‌టుడు శ్రీతేజ్ పై కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేశాడ‌ని ఓ యువ‌తి కూక‌ట్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తును చేప‌ట్టారు. కాగా.. శ్రీతేజ్ పై గ‌తంలోనూ ఓ కేసు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఓ మహిళతో ఆయ‌న‌కు వివాహేత‌ర సంబంధం ఉంది. ఈ విష‌యం తెలిసి ఆ మ‌హిళ భ‌ర్త గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ స‌భ్యులు శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే తాజాగా మ‌రో కేసు న‌మోదైంది. దీంతో శ్రీతేజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అత‌డి కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు. నటుడు శ్రీ తేజ్ గతం లో వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, పుష్ప ది రైజ్‌, మంగళవారం, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్‌ ప్రస్తుతం పుష్ప ది రూల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Tags

Next Story