Samantha : మీ శ్రమించే తత్వమే నాకు స్ఫూర్తి..సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

Samantha : మీ శ్రమించే తత్వమే నాకు స్ఫూర్తి..సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

సినీ నటుడు రానా, సమంత మధ్య సోదరీ సోదర బంధం అందరికీ తెలిసిందే. ఇవాళ రానా పుట్టిన రోజును పురస్కరించుకొని సామ్ ఓ ట్వీట్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇన్స్టా స్టోరీస్ వేదికగా ఈ పోస్ట్ పెట్టింది సామ్. "హ్యాపీ బరై డియర్ రానా. ప్రతి పనిలోనూ మీరు 100% శ్రమిస్తారు. మీలోని శ్రమించేతత్వం నాకు స్ఫూర్తి. నేను చేసే ప్రతి పనిని ఇంకా బాగా చేసేలా అది నన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నా” అని రాసుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు, రానా పుట్టినరోజు సందర్భంగా రామ్చరణ్ కూడా విషెస్ తెలిపారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడికి అంతా మంచే జరగాలని కోరుకున్నాడు. ‘బెంగళూరు డేస్ ' తమిళం రీమేక్ కోసం రానా సమంత కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ టైం నుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రానా తనకు అన్న లాంటి వ్యక్తి అని సామ్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు.

Tags

Next Story