Youtuber Gayathri Death: కొబ్బరిబొండాల్లో మద్యం.. అదే గాయత్రి ప్రాణాలు తీసిందా..?

Youtuber Gayathri Death: యూట్యూబర్ గాయత్రి రోడ్డు ప్రమాదం వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన గాయత్రి ఇలా హఠాత్తుగా మరణించడం తన స్నేహితులను కలచివేస్తోంది. అందుకే తన ఫ్రెండ్స్ అంతా సోషల్ మీడియా వేదికగా గాయత్రి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగే కాసేపటికి ముందు ఏం జరిగిందని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా వారికి ఒక లీడ్ దొరికింది.
గాయత్రి, తన స్నేహితుడు రోహిత్ ఇద్దరు కారులో వస్తుండగా గచ్చిబౌలిలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయత్రి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే పోలీసుల ప్రధాన విచారణలో వీరిద్దరు మద్యం సేవించి ఉన్నట్టు బబయటపడింది. అయితే ఆ మద్యం గురించి మరిన్ని వివరాలను పోలీసులు బయటపెట్టారు.
హోలీని సెలబ్రేట్ చేసుకోవడానికి రోహిత్, తన స్నేహితులు ముందే మద్యాన్ని కొనిపెట్టుకున్నారు. ఆ మద్యాన్ని కొబ్బరిబొండాల్లో కలుపుకొని పబ్‌కు వెళ్లారు. పబ్ నుండి బయల్దేరిన రోహిత్, గాయత్రిలు దారిలో కూడా మద్యాన్ని సేవించారు. యాక్సిడెంట్ అయిన కారులో పోలీసులు మద్యం కలిపిన రెండు కొబ్బరిబొండాలను స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com