Naa Anveshana Anvesh : మారని అన్వేష్.. ఇవేం వ్యాఖ్యలు..

యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ లో ఇంకా మార్పు కనిపించట్లేదు. ఎంతసేపు తాను అనుకున్నది ఇష్టం వచ్చినట్టు అనేయడం వరకే పరిమితం అవుతున్నాడు గానీ.. అంతకు మించి కొంత అయినా పశ్చాత్తాపం అతని ప్రవర్తనలో కనిపించట్లేదు. శివాజీ హీరోయిన్ల బట్టలప చేసిన రెండు కామెంట్లను పట్టుకుని అన్వేష్ ఎంత రచ్చ చేశాడో అందరం చూశాం. హిందూ దేవతలను అవమానించాడు. ఇండియాను దారుణంగా మాట్లాడాడు. దేశాన్ని, హిందూ దేవతలను అవమానించినందుకు అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. దెబ్బకు నిన్న ఇన్ స్టా అకౌంట్ కూడా బ్యాన్ అయిపోయింది. 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న అకౌంట్ బ్యాన్ అయినందుకు అతను కొంచెమైనా పశ్చాత్తాప పడుతాడేమో అని అంతా అనుకున్నారు.
కానీ అదేం లేదు. దానికి అతను ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనకు ఇన్ స్టా నుంచి రూపాయి లాభం లేదని.. అలాంటి ఇన్ స్టా అకౌంట్ ఉన్నా, పోయినా ఒక్కటే అంటూ తెలిపాడు. తనకు చేతులు, కాళ్లు ఉన్నాయని.. ఒక కాలు పోతే.. రెండు చేతులు, ఇంకో కాలు మీద నడుస్తా అంతేగానీ చేయాల్సింది ఆపను.. ఇప్పుడు ఇన్ స్టాపోతే యూట్యూబ్ ఉంది, ఫేస్ బుక్ ఉంది అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు.
నిజంగా అతని చేష్టలు చూస్తే.. యూట్యూబ్ అకౌంట్ కూడా తీసేసే దాకా బుద్ధి రాదేమో అంటున్నారు. మెటా సంస్థ ఇన్ స్టా అకౌంట్ ను బ్యాన్ చేసింది గానీ.. ఫేస్ బుక్ అకౌంట్ ను కూడా బ్యాన్ చేయాల్సింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరి త్వరలోనే ఆ పని కూడా చేస్తే అప్పుడు అన్వేష్ కు ఎంతో కొంత బుద్ధి వస్తుందేమో అంటున్నారు నెటిజన్లు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
