HBD Virat Kohli : కోహ్లీని వెంటాడుతున్న ఆ రెండు డ్రీమ్స్...!
HBD Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు... ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అటు అభిమానులు, ఇటు సహచర ఆటగాళ్లు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..!
15 ఏళ్ల వయసులో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు కోహ్లీ.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ 2008లో అండర్ 19 ప్రపంచ కప్‌కి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అప్పుడే అండర్ 19 వరల్డ్ కప్‌ను సాధించి పెట్టాడు. ఇదే కోహ్లీ కెరీర్ ని మలుపుతిప్పింది.
ఆ తర్వాత టీమిండియా జట్టులో చోటు సంపాదించుకున్నాడు... వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన ప్లేస్‌ను పదిలం చేసుకున్నాడు. దీనితో కొద్ది టైంలోనే ది బెస్ట్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ గా ధోనికి వరుసగా ఎదిగాడు.
అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా సత్తా చాటుతూ జట్టును ముందుకు నడిపించడంలో కోహ్లీ సూపర్ సక్సెస్ అయ్యాడు.. దాయాది దేశం అయిన పాకిస్తాన్ కూడా మాకు కోహ్లీ కావాలి అనే స్థాయికి వెళ్ళాడు. 2016 సీజన్లో అతడి పరుగుల వరద, శతకాల జోరును ఎవ్వరూ మర్చిపోలేరు.
అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలలో కలిపి మొత్తం 443 మ్యాచుల్లో 50కి పైగా సగటు, సుమారు 80 స్ట్రైక్‌రేట్‌తో 21,901 పరుగులు చేశాడు. ఇందులో 70 సెంచరీలు, 118 హాఫ్ సెంచరీలున్నాయి. 57 మ్యాన్ అఫ్ ది మ్యాచ్ , 19 ప్లేయర్ అఫ్ ది సిరిస్ అవార్డులున్నాయి.
ఇక ఐపీఎల్‌లో మొత్తం 207 మ్యాచులాడిన కోహ్లీ.. 6,283 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలున్నాయి.
ఐసీసీ వన్డే ర్యాకింగ్ లలో 873 పాయింట్ లతో కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్ బెంగళూరుకే ఆడుతున్నాడు. అయితే ఆ జట్టుకు ఒక్కసారి కూడా కప్పును అందించలేకపోయాడు. ఇక భారత్ కి ఆటగాడిగా, కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించిన కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీని అందించలేకపోయాడు.న త్వరలోనే కోహ్లీ వీటిని అందుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విరాట్.. హ్యాపీ బర్త్‌డే కోహ్లీ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com