ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా కలకలం

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా కలకలం
ఐపీఎల్ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని కరోనా వెంటాడుతుంది.

ఐపీఎల్ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని కరోనా వెంటాడుతుంది. ఇప్పటికే చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో 13 మందికి కరోనా సోకి కోలుకోగా.. ఈ మహమ్మారి చూపు ఢిల్లీ క్యాపిటల్స్ పై పడింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ కు కరోనా పరీక్ష చేయగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దుబాయికి వెళ్లిన తరువాత మూడు సార్లు కరోనా పరీక్షలు చేసుకోగా.. మూడోసారి పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఆయన 14 రోజులు ఐసోలేషన్ లో ఉంటాడని.. తరువాత పరీక్షల్లో రెండు సార్లు నెగిటివ్ రిపోర్ట్స్ రావల్సి ఉంటుంది. ఇటీవల బీసీసీఐ మెడికల్ కమిషన్ సభ్యుడు కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో మొత్తం ఐపీఎల్ కు వెళ్లినవారిలో మొత్తం 15 మందికి కరోనా సోకింది. ఢిల్లీ ఫిజియోథెరపిస్ట్ కు కరోనా సోకడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆందోళన రేగింది.

Tags

Next Story