IND vs NZ : ముగిసిన మొదటిరోజు ఆట.. అరంగేట్రంలోనే శ్రేయస్ అర్థశతకం

IND vs NZ : కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీంఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్ (75), రవీంద్ర జడేజా (50) పరుగులతో ఉన్నారు. ఇక శుభ్‌మన్ గిల్ (52), మయాంక్ అగర్వాల్ 13, ఛెతేశ్వర్ పుజారా 26, అజింక్య రహానె 35 పరుగులు చేశారు. వీస్ బౌలర్లలో జేమీసన్ 3, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు. తొలిరోజు ఆటలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్ అయ్యర్ గురించే.. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. చాలా ఓపికగా, ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా ఆడాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కనుక సెంచరీ చేస్తే అదో మధుర జ్ఞాపకంగా మిగులుతుందని చెప్పవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com