రెండో టెస్ట్ పై పట్టుబిగిస్తున్న రహానె సేన!
By - TV5 Digital Team |28 Dec 2020 9:48 AM GMT
ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో పట్టు బిగుస్తుంది భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ని కట్టడి చేస్తోంది.
ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో పట్టు బిగుస్తుంది భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ని కట్టడి చేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్లను కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్కోర్ తో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో కామరూన్ గ్రీన్(17), పాట్ కమిన్స్(15) ఉన్నారు. నాలుగో రోజు ఆటలో టెయిలెండర్లను కనుక త్వరగా అవుట్ చేస్తే ఇండియా విజయం పక్కా అయినట్టే.. ఇక టీమిండియా బౌలర్లలో జడేజా 2 వికెట్లు తీయగా.. బుమ్రా, ఉమేష్, సిరాజ్, అశ్విన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com