IND Vs ENG : ఇంగ్లండ్ టార్గెట్ 330 పరుగులు..!
By - TV5 Digital Team |28 March 2021 12:19 PM GMT
ఆరంభంలో అదరగొట్టిన భారత బ్యాట్స్మన్.. వరుసగా వికెట్లు కోల్పోయి చివరి వరకు ఆ ఊపు కొనసాగించలేకపోయారు.
సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా కాస్త తడబడింది. ఆరంభంలో అదరగొట్టిన భారత బ్యాట్స్మన్.. వరుసగా వికెట్లు కోల్పోయి చివరి వరకు ఆ ఊపు కొనసాగించలేకపోయారు. పంత్ (78), ధావన్(67), హార్దిక్ పాండ్యా (64), రోహిత్ (37) రాణించడంతో 48.2 ఓవర్లకు 329 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ 3, రషీద్ 2 వికెట్లు తీయగా.. కర్రన్, టోప్లే, అలీ, లివింగ్ స్టన్, స్టోక్స్ తలో వికెట్ తీశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com