India vs Australia 2nd Test: 70 కొడితే రెండో టెస్ట్ మనదే!

India vs Australia : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తక్కువ రన్స్ కే పరిమితమైంది. 200 స్కోరుకు ఆలౌటైన కంగారూ జట్టు.. టీమిండియాకు 70 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఓవర్‌నైట్ స్కోరు 133/6 వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. మరో 67 పరుగులు సాధించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. గ్రీన్(45), కమిన్స్ (22), స్టార్క్ (14) పోరాటం వల్ల ఆ మాత్రం స్కోరైనా చేసింది. గ్రీన్, కమిన్స్ వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు.
అయితే బుమ్రా ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన బాట్స్ మెన్స్ లపెద్దగా రాణించకపోవడంతో ఆసీస్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్ 3, బుమ్రా, అశ్విన్, జడేజా 2 వికెట్లు తీయగా, ] ఉమేశ్ యాదవ్ 1 వికెట్ తీశాడు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 195 రన్స్ చేయగా.. భారత్ 326 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే!
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com