పుణే వన్డేలో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన టీమిండియా

పుణే వన్డేలో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన టీమిండియా
భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు కోల్పోయారు.

పుణె వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు కోల్పోయారు. ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌ స్టో ఇండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని బౌండరీలతో విరుచుకుపడ్డారు. అయితే వీరిద్దరూ అవుటైన తరువాత ఇంగ్లండ్‌ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. వరుస వికెట్లు పడడంతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. మొయీన్ అలీ చివరి వరకు పోరాడినా..ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో రాణించగా.. శార్దూల్ ఠాకూర్ 3, భువనేవ్వర్ 2, కృనాల్ పాండ్యాకు 1 వికెట్ దక్కాయి.

ఇక తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. రోహిత్, ధవన్ వికెట్ పడకుండా నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రోహిత్ అవుటైనా.. కోహ్లీ, ధవన్ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ అవుట్ కావడంతో స్కోరు బోర్డు స్పీడ్‌కు అడ్డుకట్ట ఏర్పడింది. అయ్యర్ తరువాత రాహుల్ సంయమనంతో ఆడగా.. కృనాల్ పాండ్యా విజృంభించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3, మార్క్ ఉడ్ 2 వికెట్లు దక్కాయి.

Tags

Read MoreRead Less
Next Story