India vs England 2nd Test Day 4 : ఇంగ్లండ్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. రెండవ టెస్టులో ఘన విజయం!
India vs England 2nd Test Day 4 : ఇంగ్లండ్ పై తొలి టెస్టు ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రెండవ టెస్టులో 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ను 164 పరుగులకే ఆలౌట్ చేసింది. స్పిన్నర్ అక్షర్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లీష్ ఆటగాళ్లును దెబ్బతీయగా.. అశ్విన్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండో వికెట్లతో చెరో చెయ్యి వేశారు.
తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 329 పరుగులకు ఆలౌట్ కాగా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను 134 పరుగులకే భారత బౌలర్లు చుట్టేశారు. దీంతో కోహ్లీసేనకు 195 పరుగుల ఆధిక్యం లభించింది. రెండవ ఇన్నింగ్ లో అశ్విన్ అద్భుతమైన సెంచరీతో టీమిండియా 286 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 482 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.
అయితే భారత్ స్పిన్నర్ల ధాటికి 164 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిపాలైంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన లోకల్ బాయ్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈనెల 24న ప్రారంభంకానుంది.
Superb character and fighting spirit on display.🙌 Well done boys. The focus is now on the next one. 🇮🇳💪 pic.twitter.com/TEVceiOhYM
— Virat Kohli (@imVkohli) February 16, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com