తొలి ఇన్నింగ్స్.. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ నడ్డి విరిచిన భారత బౌలర్లు

తొలి ఇన్నింగ్స్.. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ నడ్డి విరిచిన భారత బౌలర్లు
ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ నడ్డి విరిచారు.

రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అద్బుతంగా రాణించారు. బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ 134 పరుగులకే కుప్పకూలారు. దీంతో భారత్ కు 195 పరుగుల ఆధిక్యం లభించింది.

అశ్విన్ ఐదు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ నడ్డి విరిచారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి ఓ వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది.

ప్రస్తుతం టీమిండియా 249 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 300 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 29 పరుగులు చేసి ఆలౌట్ అయింది.


Tags

Read MoreRead Less
Next Story