నిర్ణయాత్మక మ్యాచ్ : ఆదివారం ఇండియా-ఇంగ్లండ్ మధ్య సమరం..!
సండే ధమాకాకు ఇండియా, ఇంగ్లండ్ జట్లు రెడీ అవుతున్నాయి. పూణే వేదికగా జరిగే మూడో సమరానికి ఇటు కోహ్లీసేన, అటు ఇంగ్లీష్ జట్టు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచుల్లో చెరో ఒకటి గెలిచాయి. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డే ఆసక్తిగా మారింది. రెండో వన్డేలో భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్ ఛేదించి విజయం సాధించడంతో కోహ్లీసేన జట్టులో మార్పులు చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ లో కెప్టెన్ కోహ్లీ మార్పులు చేయడం లేదు. అయితే బౌలింగ్ విభాగంలోనే భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు నటరాజన్ లేదా హైదరాబాదీ సిరాజ్ ను చేరే అవకాశం ఉంది. అటు ఇంగ్లీష్ జట్టు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి మూడో వన్డే సమరానికి రెడీ అవుతున్న వేళ అంతిమ విజయం ఎవరికి వరిస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com