Ind vs NZ : నేడు రెండో టీ20 మ్యాచ్.. సిరీస్ పై కన్నేసిన రోహిత్ సేన..!

Ind vs NZ : ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్.. న్యూజిలాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇవాళ టీమిండియా, కివీస్ జట్ల మధ్య రెండో టీ-20 మ్యాచ్ జరగనుంది. రాంచీ వేదికగా సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ రెండో మ్యాచ్‌లో రెండు జట్లకు మరోసారి టాస్ కీలకంగా మారనుంది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో తొలి మ్యాచ్ నెగ్గిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. జైపూర్ తొలి టీ20లో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడగా.. మూడో స్థానంలో బరిలోకి దిగిన సూర్యకుమార్ చక్కటి ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఇక.. సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగుతుండటం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశాలు. ఇటు తొలి మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకొని తిరిగి గెలుపు బాట పట్టాలని కివీస్ జట్టు చూస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com