India vs West Indies : సొంతగడ్డపై చెలరేగిన టీమిండియా .. సిరీస్ క్లీన్ స్వీప్

India vs West Indies : సొంతగడ్డపై టీమిండియా చెలరేగింది. భారత్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్‌ను అటు వన్డేల్లోనూ, ఇటు టీ ట్వంటీల్లోనూ చిత్తుచిత్తుగా ఓడించింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... టీ ట్వంటీల్లోనూ అదే రిపీట్ చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మూడో టీ ట్వంటీలో వెస్టిండీస్‌పై 18 పరుగుల తేడాతో నెగ్గి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ సింగిల్ డిజిట్‌కే అవుటైనా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. అయితే వెంటవెంటనే శ్రేయస్, ఇషాన్, రోహిత్ శర్మ అవుటవడంతో భారత్ పరుగుల వేగం తగ్గింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఏడు సిక్స్‌లతో చెలరేగి ఆడాడు. అతనికి వెంకటేష్ అయ్యర్ రూపంలో చక్కని తోడ్పాటు లభించడంతో భారత్ పటిష్ట స్కోరుకు చేరుకుంది. సూర్యకుమార్ 65, వెంకటేశ్ అయ్యర్ 35 పరుగులు సాధించారు.
185 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌ను ఆరంభంలోనే దీపక్ చాహర్ దెబ్బతీశాడు. ఓపెనర్లు మయేర్, షాయ్ హోప్‌లను సింగిల్ డిజిట్‌కే అవుట్ చేశాడు. కష్టాల్లో పడ్డ వెస్టిండీస్‌ను నికోలస్ పూరన్ ధాటిగా ఆడుతూ ఆదుకునే ప్రయత్నం చేసినా, మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసి ఓటమి పొందింది. దీంతో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ కూడా టీమిండియా ఖాతాలో చేరింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, షార్దుల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com