మూడో టెస్ట్.. రెండు రోజుల్లోనే.. 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం..!

మూడో టెస్ట్.. రెండు రోజుల్లోనే.. 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం..!
పింక్ బాల్ టెస్టులో టీంఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ నష్టపోకుండా చేధించింది.

పింక్ బాల్ టెస్టులో టీంఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు రోహిత్(25), గిల్ (15) పరుగులతో విజయాన్ని అందించారు. దీనితో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరిస్ లో భారత్ 2-1తో ముందజలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్‌ 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 5 వికట్లు, అశ్విన్‌ 4, సుందర్‌ ఒక వికెట్‌ తీశాడు.

Tags

Next Story