విజయంతోనే బోణీ.. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తు..!

విజయంతోనే బోణీ.. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తు..!
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. 66 పరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టును మట్టికరిపించింది.

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. 66 పరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టును మట్టికరిపించింది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు కేవలం 251పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో ఇంగ్లాండ్ గెలిచేలా కనిపించింది కానీ భారత బౌలర్లు పుంజుకోవడంతో కీలకమైన వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. దీనితో సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story