టీమిండియా ఉమెన్‌ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అద్భుత క్యాచ్‌..!

టీమిండియా ఉమెన్‌ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అద్భుత క్యాచ్‌..!
క్రికెట్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలు అరుదుగా చూస్తుంటాం. ముఖ్యంగా పురుషుల క్రికెట్‌లో ఇవి కామనే అయినా.,..మహిళల క్రికెట్‌లో మాత్రం ఇవి అత్యంత అరుదు.

క్రికెట్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలు అరుదుగా చూస్తుంటాం. ముఖ్యంగా పురుషుల క్రికెట్‌లో ఇవి కామనే అయినా.,..మహిళల క్రికెట్‌లో మాత్రం ఇవి అత్యంత అరుదు. అలాంటి అరుదైన విన్యాసమే చేసింది.. టీమిండియా క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌‌‌‌. నార్తంప్టన్‌ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో... హర్లీన్‌ బౌండరీ దగ్గర అద్భుతమైన క్యాచ్‌ అందుకుంది. ముందుగా బౌండరీ లోపు క్యాచ్‌ అందుకున్న హర్లీన్‌ బ్యాలన్స్‌ కోల్పోయింది. దీంతో సమయస్పూర్తితో వ్యవహరించి... బంతిని పైకి విసిరేసి మళ్లీ బౌండరీ బయటకు డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ అందుకుంది. హర్లీన్‌ అద్భుతమైన క్యాచ్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాతో పాటు... క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌తో పాటు పలువురు ప్రముఖులు హర్లీన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.


Tags

Read MoreRead Less
Next Story