Sunil Gavaskar : షేన్ వార్న్‌పై సునీల్ గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
Sunil Gavaskar : ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మరణం పట్ల భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రికెట్‌కు వార్న్ చేసిన కృషిని ప్రశంసించారు గవాస్కర్.. అయితే వార్న్ దిగ్గజ స్పిన్నర్ అని అనలేమని, అతడికంటే ముత్తయ్య మురళీధరన్ మెరుగ్గా బౌలింగ్ చేయగలడని, భారత్ పై అతని రికార్డు సాధారణంగానే ఉందని, అందుకే అతడిని దిగ్గజ స్పిన్నర్ గా భావించలేమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ పైన ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 52 ఏళ్ల వయస్సులో గుండెపోటు కారణంగా షేన్ వార్న్ కన్నుమూశారు. వార్న్ ది సహజ మరణమేనని థాయ్ లాండ్ పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టమ్ చేసిన తరవాత ఆయనది సహజ మరణమేనని వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. షేన్ వార్న్ తన టెస్టు క్రికెట్ లో 708 వికెట్లు, వన్డే ఇంటర్నేషనల్స్‌లో 293 వికెట్లు తీశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com