U-19 WC Final : నేడే ఫైనల్ మ్యాచ్.. ఇంగ్లండ్‌తో టీమిండియా..!

U-19 WC Final : అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌కు టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఇవాళ ఇంగ్లండ్‌తో యష్‌ధూల్ సేన అమీ తుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో నాలుగు సార్లు అండర్-19 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది యువభారత్. మరోసారి కప్పు గెలివాలని ప్రణాళికలు రచిస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ యష్ ధూల్, వైస్ కెప్టెన్ రషీద్ ఫామ్‌లో ఉండడం...బౌలింగ్‌లో రవి కుమార్, విక్కి రాణిస్తుండడం భారత్‌కు కలిసొచ్చే అంశం.ఒత్తిడిని అధిగమిస్తే భారత్ గెలుపు సాధించడం కష్టమేమి కాదంటున్నారు మాజీలు. అటు ఇంగ్లండ్ సైతం ప్రపంచకప్ కలను మరోసారి సాకారం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. 1998 తర్వాత మళ్లీ ఇప్పుడే ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో భారత్‌లానే ఇంగ్లండ్‌కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ టామ్‌పెర్ట్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. పేసర్ జాషువా బోడెన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com