కరోనా ఉదృతి.. కోహ్లీ దంపతుల కీలక నిర్ణయం.. !

కరోనా ఉదృతి.. కోహ్లీ దంపతుల కీలక నిర్ణయం.. !
దేశంలో ప్రజల కష్టాలను చూస్తే బాధ కలుగుతుందని అన్నాడు. అందుకే తన భార్య అనుష్క శర్మతో కలిసి కరోనా వైరస్ పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపాడు.

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకూ రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రజల కష్టాలను చూస్తే బాధ కలుగుతుందని అన్నాడు. అందుకే తన భార్య అనుష్క శర్మతో కలిసి కరోనా వైరస్ పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపాడు.

కష్టకాలంలో కరోనాపై పోరాడుతున్న వారికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. ketto వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు సమీకరించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కోహ్లీ దంపతులు. తాము రెండు కోట్ల రూపాయలను ఇస్తున్నట్టుగా తెలిపాడు. దీని ద్వారా రూ.7 కోట్లు సమీకరించాలని ఈ జంట లక్ష్యంగా పెట్టుకుంది. కాగా కరోనా రెండో దశ విజృంభణపై దేశం పోరాటం చేస్తోందని, వైద్యారోగ్య వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నాడు.


Tags

Read MoreRead Less
Next Story